రాష్ట్ర అసెంబ్లీకి ఎల్లుండికి వాయిదా పడింది. బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్ పద్దులను చదివి వినిపించారు. ఏయే రంగానికి ఎంత కేటాయింపులు చేశారు? ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు, యువవికాసం, షెడ్యూల్ కాస్ట్ కేటాయింపులు, మైనార్టీ కేటాయింపుల గురించి వెల్లడించారు.
ఆ తర్వాత ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత ప్రతిపక్షాలకు బడ్జెట్ మీద మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అనంరతం అసెంబ్లీని ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఇదిలాఉండగా, ప్రతిపక్ష పార్టీల సభ్యులు అసెంబ్లీ లాబీ వద్ద ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.