Assembly elections : చంద్రబాబుకు ఈసీ నోటీసులు

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31 ఎమ్మిగనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫెక్సీలను తొలగించారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే నేతలు ఎన్నికల ఆదేశాలను లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి వివరణ ఇవ్వాలని ఆయన నాయకులకి నోటీసులు జారీ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version