10లక్షల మందితో సభ.. ఏర్పాట్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

-

అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి లోక్ సభ ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6 న తుక్కుగూడలో జనజాతర పేరిట భారీ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

ఈ క్రమంలో తుక్కుగూడలో ఎల్లుండి జరిగే కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రులతో కలిసి వెళ్లిన ఆయన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించే వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సభలోనే జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version