సినిమా ఛాన్స్ ల కోసం అమ్మాయిలు పడే ఆరాటంను క్యాష్ చేసుకోవడానికి చాలా మంది ఇండ్రస్టిలో గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ వుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువుగా కొత్త నటీ నటులతో సినిమా ప్లాన్ చేస్తుంటారు. కొత్త వాళ్ల లో ఛాన్స్ కావాలని మగవాళ్ళు వస్తే హీరో ఛాన్స్ ఇస్తామని డబ్బులు వసూలు చేస్తారు. అదే అమ్మాయిలు వేస్తే డబ్బులు అడగకుండా కమిట్ మెంట్ అడుగుతారు
చాలా మంది అమ్మాయిల తమ కెరియర్ కోసం లొంగిపోతారు. ఎందుకంటే వారు ఇల్లు విడిచి వచ్చింది దీనికోసమే అని బాధను దిగమింగుకుంటారు. అందుకే అడగగానే కమిట్ మెంట్ కు ఒకే అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్ లు టాలెంట్ ను మాత్రమే చూసి అమ్మాయిలను ఎంపిక చేస్తున్నారు.
కాని కొంత మంది పెద్ద దర్శకుల వద్ద పని చేసే కో డైరెక్టర్ లు, అసిస్టెంట్ డైరెక్టర్ లు మాత్రం చిలక్కొట్టుడు మాత్రం ఆపడం లేదట. ఒక క్రియేటివ్ దర్శకుడు దగ్గర పనిచేసే వారు మాత్రం పాత అలవాటు ప్రకారం కొత్త అమ్మాయిలను ఎంపిక చేసుకోవడం కోసం ఇంకా గెస్ట్ హౌస్ ఇంటర్వ్యూ లను కంటిన్యూ చేస్తూనే ఉన్నారట. ఈ విషయం తెలియని డైరెక్టర్ మాత్రం వాళ్లని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు.