ఎన్నో రకాల స్కీమ్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. వీటి వలన అనేక బెనిఫిట్స్ కలుగుతున్నాయి. వీటిల్లో పేదల కోసం కూడా అందుబాటులో ఉండే పథకాలు ఉన్నాయి. ఇందులో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా భాగం అని చెప్పచ్చు. ఇక ఈ పధకం కోసం పూరి వివరాల లోకి వెళితే…
ఈ పథకం లో చేరితే ప్రతి నెలా రూ.5000 పొందొచ్చు. పైగా ఏ రిస్క్ ఉండదు. ప్రతి నెలా ఈ డబ్బులు చెల్లిస్తూ వెళ్లాలి. 60 ఏళ్ల తర్వాత మీకు ప్రతి నెలా రూ.5 వేలు వస్తాయి. దీనిలో చేరడం వలన రూ.1000 పెన్షన్ వస్తుంది.
ప్రతి నెలా చెల్లించే మొత్తం ప్రాతిపదికన మీకు ప్రతి నెలా వచ్చే డబ్బులు కూడా మారతాయి. ఒకవేళ స్కీమ్‌లో చేరిన వారు మరణిస్తే నామినీకి సగం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. పైగా ఈ స్కీమ్ వలన మరో బెనిఫిట్ కూడా వుంది. అదేమిటంటే…. చట్టం లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వడానికి మీరు దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి చేరచ్చు. 20 ఏళ్ల వయసులో ఉన్న వారు కనుక నెలకు రూ.248 కడితే అప్పుడు ప్రతీ నెల రూ.5 వేలు పెన్షన్ వస్తుంది. ఎంత త్వరగా ఈ పథకం లో చేరితే అంత ప్రయోజనం మీకు ఉంటుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పథకం లో చేరొచ్చు. తద్వారా ఈ పధకం వలన కలిగే ప్రయోజనాలని పొందవచ్చు.