నారా లోకేష్ పాదయాత్ర.. జగన్ సర్కారుకు పాడెయాత్ర అని అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగోడు, జనం సొమ్ము లక్షల కోట్లు దోచిన ఏ1 జగన్ పాదయాత్ర చేయొచ్చా అరగంట అంబటి? కోడికత్తిని తెచ్చి ఎన్నాళ్లు సానబట్టినా అది నత్తి పకోడీయే కానీ కత్తి కాదని విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు.
డబ్బు కోసం జనాల ప్రాణాలు తీసే బ్రాందీ అమ్మే జగన్ని అభినవ గాంధీ అని, ప్రచారం చేసుకోవడానికి సిగ్గులేదా? లోకేష్ పాదయాత్ర జగన్ సర్కారుకి పాడెయాత్ర. ఆ శవం ముందు నీదే డ్యాన్సు కాంట్రాక్ట్. కొత్త స్టెప్పులు నేర్చకో అంటూ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.