ప్రకటనల్లో నటించను అంటున్న ‘వి’ హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో అతిధి రావు హైదరి కి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటించినవి తక్కువ సినిమాలే అయినా తనదైన నటనతో అందంతో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇక ఇటీవలే వి సినిమాలో నాని తో జోడీ కట్టిన అతిధి రావు హైదరి… తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాజరైన అతిథులు తాను వాణిజ్య ప్రకటనల్లో నటించడం పోవడానికి గల కారణం ఏమిటో చెప్పుకొచ్చింది.

సమాజం అందాన్నే కాదు ప్రతిభను చూసి గుర్తించాలి అంటూ చెప్పిన అతిధి రావు హైదరి అందుకే తాను ఇప్పటివరకు… సౌందర్య ప్రకటనల్లో నటించను అంటూ తెలిపింది. తన కెరీర్ మొదట్లో ఓ సౌందర్య ఉత్పత్తికి సంబంధించి ప్రమోషన్ చేసే ప్రకటన ఆఫర్ తనకు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించాను అంటూ చెప్పుకొచ్చింది చెప్పుకొచ్చింది అతిథి రావు హైదరి. అందం అనేది కేవలం జీన్స్ కి సంబంధించిన విషయాలు మాత్రమే అని… అందమే అన్నిటికంటే ముఖ్యం అనేది మాత్రం అవాస్తవం అంటూ తెలిపింది.