ఎన్డీఏ పక్షాలు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూ ఉండగానే కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ బిల్లుల లో ఒక బిల్లు కి రాజ్యసభ ఆమోదం లభించింది. వ్యవసాయ బిల్లు కాపీలను అకాలీదళ్ ,ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు చించివేశారు .పోడియం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
వీరి ఆందోళన మధ్య బిల్లు ఆమోదం పొందింది. డిప్యూటీ చైర్మన్ మైక్ లాగేందుకు ఎంపీలు ప్రయత్నం చేశా.రు టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా పోడియం వద్ద ఆందోళనకు దిగారు. బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు .మిగిలిన రెండు బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది.
బిల్లుపై ఇప్పటికే ప్రతిపక్షాలకు చెందిన సీఎంలు అదేవిధంగా విపక్షాలకు చెందిన రాజ్యసభ ఎంపీలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ బిల్లులను ప్రవేశ పెట్టిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ బిల్లులు లోక్సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.