షాద్ నగర్‌లో దారుణం.. నడిరోడ్డుపై పసికందు మృతదేహం లభ్యం

-

రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. కళ్లు కూడా తెరవని ఓ పసికందు మృతదేహం నడిరోడ్డుపై లభ్యం అయ్యింది. అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం నడిరోడ్డుపై కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఆ పసికందు మృతదేహం అక్కడకు ఎలా వచ్చిందని అంతా ఆరా తీయడం మొదలెట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

బొడ్డు పేగు తాడు ఇంకా తడి ఆరకముందే ఆ పసికందును కుక్కలు ఈడ్చుకుంటూ వచ్చి రోడ్డుపై పడేశాయి. ఆ బాబు తల్లి ఎవరో తెలీదు కానీ బిడ్డ పుట్టుగానే చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారం వెలుగుచూసింది. చటాన్ పల్లి చివరిలో గల చాక్లెట్ కంపెనీ పక్కన చెట్లపొదల్లో ఓ పసికందు మృతదేహాన్ని గుర్తించిన కుక్కలు ఈడ్చుకొచ్చి రోడ్డుపై పడేశాయి.ఈ దారుణమైన దృశ్యాన్ని వీక్షించిన స్థానికులు ఒక్కసారిగా చలించిపోయారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news