వరంగల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డు మీద వైద్యుడిపై హత్యాయత్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సిద్ధార్థ రెడ్డి అనే డాక్టర్‌పై ఇనుప రాడ్లు, రాళ్లతో కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు.
గురువారం రాత్రి సదరు వైద్యుడు కారులో వెళ్తుండగా.. అడ్డుగా వచ్చిన వ్యక్తులు వాహనాన్ని ఆపారు. వైద్యుడు కారు నుంచి కిందకు రాగానే వెంట తెచ్చిన ఇనుప రాడ్లు, బండరాళ్లతో అతనిపై తల, ఒంటిపై దాడి చేశారు. ఈ ఘటన వరంగల్- బట్టుపల్లి ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నట్లు తెలిసింది. కాగా, దుండగుల దాడిలో వైద్యుడు సిద్ధార్థ రెడ్డి తీవ్రంగా గాయపడగా..అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్ లో దారుణం
నడిరోడ్డు మీద వైద్యుడిపై హత్యాయత్నం
సిద్ధార్థ రెడ్డి అనే డాక్టర్ పై ఇనుప రాడ్లు, రాళ్లతో
విచక్షణారహితంగా దాడివైద్యుడి కారును అడ్డగించి దాడి చేసిన దుండగులు
వరంగల్- బట్టుపల్లి ప్రధాన రహదారిపై ఘటన
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సిద్ధార్థ రెడ్డి పరిస్థితి… pic.twitter.com/MDym8TwSM9
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2025