తెలంగాణ లో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. శ్రీ చైతన్య న్యూ జనరేషన్ క్యాంపస్ లో ప్రధమ సంవత్సరం చదువుతున్న డేగల యోగనందిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
విద్యార్థినులు అందరూ స్టడీ అవర్ లో ఉండగా రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది శ్రీ చైతన్య న్యూ జనరేషన్ క్యాంపస్ లో ప్రధమ సంవత్సరం చదువుతున్న డేగల యోగనందిని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతలగూడెంకు చెందిన విద్యార్ధినిగా గుర్తించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.