ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల కామాంధులు విరుచుకుపడుతున్నారు. తమ పక్కింటి వారో, ఎదురింటో వారో, పొరుగింటి వారో, స్కూల్, కళాశాల, ఆపీస్ ఇలా ఏదో ఒక ప్లేస్ లో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి వారికి చుట్టాలుగానే మారుతున్నాయి.
తాజాగా మణికొండలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం పేరుతో యువతి పై అత్యాచార యత్నం చేసాడు ఓ దుర్బుద్దుడు. ఉద్యోగం కోసం స్నేహితురాలు ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసింది యువతి. అయితే ఆ యువతికి అసభ్యకర మెసేజ్ లు, కాల్స్ చేసి వేధింపులకు గురి చేసాడు. ఇదేంటని యువతి నిలదీయగా.. ఉద్యోగం ఇచ్చే ముందు క్యారెక్టర్ టెస్ట్ చేస్తున్నామంటూ బుకాయించారు. ఇది నమ్మిన ఆ యువతి.. ఇంటర్వ్యూ కోసం మణికొండ లోని తన ఇంటి లోకేషన్ పంపాడు తోట ప్రదీప్. ఇంటర్వూ పేరుతో ఇంటికి పిలిచి యువతి పై అత్యాచార యత్నం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు తోట ప్రదీప్. అతని వద్ద నుంచి తప్పించుకుని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.