హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో స్పందించిన పోలీసులు

-

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమెను పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా రాజ్ తరుణో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. కానీ అంతకుముందే తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది.రాజ్ తరుణ్ నా ప్రపంచం.. నాకు కావాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో  పోలీసులు తాజాగా స్పందించారు. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య తమకు ఫిర్యాదు చేసిందని  నార్సింగ్ ఇన్ స్పెక్టర్ వెల్లడించారు. రాజ్ తరుణ్ మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని, తనని బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనని చంపేస్తామంటూ అమ్మాయి తో పాటు ఆమె సోదరుడు బెదిరింపులకు దిగుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.  లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పైన ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version