సంగారెడ్డి జిల్లాలో దారుణం.. బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు..!

-

సాధారణంగా ప్రస్తుతం ప్రజలు చాలా సుఖానికి అలవాటు పడ్డారు. పూర్వకాలంలో అయితే కష్టపడి పని చేసే వారు కాబట్టి వారికి ఎలాంటి రోగాలు దరిచేరలేదు. ఇప్పుడు సుఖానికి అలవాటు పడ్డారు కాబట్టి 20 ఏళ్లు దాటక ముందే రకరకాల రోగాలు దరిచేరుతున్నాయి. సుఖానికి అలవాటు పడి డబ్బుల కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధమవుతున్నారు. అవసరం అయితే సొంత వారిని కూడా చంపడానికి వెనకాడటం లేదు. జల్సాలకు అలవాటు పడి దేనికైనా సిద్దమవుతున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు.. అమ్మమ్మను హత్య చేశాడు.

ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నిజాంపేట మండలం ఖానాపూర్ గ్రామంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటిపై ఉన్న బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేశాడు మనువడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో డబ్బులు, మెడలోని బంగారు గుండ్ల కోసం అమ్మమ్మ దుర్గమ్మ(60)తో గొడవ పడ్డాడు మహేష్ (26). అమ్మమ్మ ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేశాడు. బంగారు గుండ్లు తీసుకొని మనవడు మహేష్ పరారయ్యాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version