హీరోయిన్ చౌరాసియా పై దాడి కేసులో సంచలనాలు…!

-

హీరోయిన్ షాలూ చౌరాసియా పై కేబీఆర్ పార్క్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. నటి పై దాడి చేసిన అనంతరం ఆగంతకుడు నాలుగు గంటల పాటు అదే పరిసరాల్లో సంచరించినట్టు టవర్ లొకేషన్ లో సిగ్నల్ లు కనిపించడం కీలకంగా మారింది. దాదాపు నాలుగు గంటల పాటు దుండగుడు అదే ప్రాంతం లో సంచరించినట్టు గుర్తించారు. కాగా ఈ కేసు మిస్టరీ గా మారింది.

Attack on actress shalu chourasiya

ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం చౌరాసియా జీహెచ్ఎంసీ వాక్ వేలో వాకింగ్ కు వెళ్ళింది. 8గంటల సమయం లో స్టార్ బక్స్ ముందు వాకింగ్ చేస్తుండగా అప్పటికే వేచి చూస్తున్న దుండగుడు వెనక నుండి వచ్చి కింద పడేసి దాడి చేశాడు. ఆ తరవాత అతడిని వదిలించుకోవడానికి ప్రయత్నించింది. పది నిమిషాల పాటు ప్రయత్నించి డయల్ 100 కు ఫోన్ చేసింది. ఆ సమయంలో దుండగుడు ఫోన్ లక్కోగా నటి పరుగులు తీసింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version