టార్గెట్ అరవింద్: కారు నేతల టెన్షన్ అదే!

-

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి…నేతల మధ్య మాటల తుటాలు పెళుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు దారుణంగా తిట్టుకుంటూ రాజకీయాన్ని మరొక లెవెల్ కు తీసుకెళ్లారు. తిట్టుకోవడంతో ఆగితే పర్లేదు..ఈ మధ్య ఏకంగా దాడులు కూడా జరిగిపోతున్నాయి. ప్రత్యర్ధి నేతలపై దాడులు జరగడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కామన్ అయిపోయింది. ముఖ్యంగా దూకుడుగా ఉంటున్న బీజేపీ నేతలపై దాడులు ఎక్కువగా జరుగుతాయి. ఆ మధ్య బండి సంజయ్ నల్గొండ టూరుకు వెళ్ళగా అక్కడ ఆయనపై రాళ్ళ దాడి జరిగింది…టీఆర్ఎస్ శ్రేణులే ఈ దాడి చేశాయని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు.అలాగే ఎంపీ అరవింద్ పై కూడా ఆ మధ్య దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే మరొక్కసారి అరవింద్ పై దాడి జరిగింది. తాజాగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఏర్దండి గ్రామంలో వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్ళిన అరవింద్ కు వ్యతిరేకంగా స్థానికంగా ఉండేవారు నిరసనలు తెలిపారు. గతంలో అక్కడ ఓ భూ వివాదం పరిష్కరిస్తానని చెప్పి…అరవింద్ మాట తప్పారని నిరసనలు తెలియజేశారు. పోలీసులు పరిస్తితులని చక్కదిద్ది ఎంపీ కాన్వాయ్ ని పంపించేశారు.

ఇదే క్రమంలో బీజేపీ శ్రేణులు…గ్రామస్తులపై దాడికి దిగారని ప్రచారం జరిగింది..దీంతో రిటర్న్ లో వస్తున్న ఎంపీ కాన్వాయ్ పై దాడి జరిగింది. అయితే ఇదంతా టీఆర్ఎస్ కనుసన్నలోనే జరిగిందని, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ ఈ దాడికి సూత్రదారి అని ఎంపీ అరవింద్ అంటున్నారు. ఇలా పదే పదే అరవింద్ పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి అరవింద్ ని టీఆర్ఎస్ గట్టిగానే టార్గెట్ చేసినట్లు ఉంది.

అరవింద్ కు చెక్ పెడితే..నిజామాబాద్ లో బీజేపీ బలం తగ్గుతుందనేది టీఆర్ఎస్ ప్లాన్ గా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అరవింద్ వల్ల జిల్లాలో బీజేపీ బలం ఇంకా పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఆయనపై దాడులు చేస్తూ…దూకుడుగా ఉండకుండా చేయాలనేది టీఆర్ఎస్ ప్లాన్ అని, కానీ అది వర్కౌట్ కాదని అరవింద్ ఇంకా దూకుడుగా పనిచేస్తారని బీజేపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. మొత్తానికి అరవింద్ కు చెక్ పెట్టడమే టీఆర్ఎస్ టార్గెట్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version