అవినీతి చేసిన వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తారు : ఆదిమూలపు సురేష్‌

-

చంద్రబాబు మోసగాళ్లకు మోసగాడ‌ని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు స్కామ్‌పై అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రి మాట్లాడారు. అవినీతి అనే చాలా చిన్న పదం. అమరావతి గ్రాఫిక్స్‌తో గారడి చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి భూములను నొక్కేసిన టక్కరి దొంగ చంద్రబాబు అని మంత్రి విమ‌ర్శించారు. చంద్రబాబు దోషి కనుకనే అరెస్టు అయ్యారు.. హెరిటేజీ తో పేదల భూములు లాక్కున్నారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కోట్లకు కక్కూర్తి పడ్డారు.. లింగమనేని, నారాయణ భూముల రేట్లు పెంచుకోవడానికి మాత్రమే ఇన్నర్ రింగ్.. ఎందుకు లోకేష్ ఢిల్లీలో ఛానెళ్ళ వెంటపడి తిరుగుతున్నాడు అని ఆయన పేర్కొన్నారు.

అవినీతి చేసిన వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తారు.. రాష్ట్రం 70 శాతం పట్టణ ప్రాతాలుగా మారనుంది.. స్వచ్ఛ సర్వేక్షణ్ నినాదంతో సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు.. విజయవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామన్నారు.. కాలువలు ఇరువైపులా సుందరీకరణ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఐకానిక్ హ్యాంగింగ్ బ్రిడ్జి 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అవినాష్ ను గెలిపించి తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపాలి.. చంద్రబాబు కోర్ట్ తీర్పు ప్రకారం రిమాండ్ కి వెళ్ళారు అని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది.. అవినీతి చేసిన వారిని ఎవరిని వదిలేది లేదు.. హెరిటేజ్ సంస్థ నుంచి వచ్చే డబ్బులు ఉన్నప్పటికీ.. అవినీతి సొమ్ముకు చంద్రబాబు ఆశ పడ్డాడు.. ఇన్నర్ రింగ్ లేకుండా అవినీతి ఎలా జరుగుతుంది అని ప్రశ్నించే టీడీపి నేతలుకి అక్కడ భూముల రెట్లు ఎందుకు పెరిగాయో తెలియదా అని ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. రాజకీయ కక్షతో చంద్రబాబు అరెస్ట్ జరుగలేదు.. చంద్రబాబు ప్రజా ఆదరణ కోల్పోయాడు అంటూ మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version