అభ్యర్థుల ప్రకటనపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలోనే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు బీఆర్ఎస్‌లో ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి హన్మంతరావు రేపు పార్టీలో చేరబోతున్నారని తెలిపారు.

ఆయన కుటుంబానికి రెండు టికెట్లు ఖరారు చేశామని స్పష్టం చేశారు. విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. స్క్రీనింగ్ కమిటీ నివేదికను సిద్ధం చేశామని తెలిపారు. కేటీఆర్‌కు ఏపీ వాళ్ల ఓట్లు కావాలి.. కానీ, వాళ్లను మాత్రం పక్క రాష్ట్రం వాళ్లు అంటారని మండిపడ్డారు. ఎవరు ఎక్కడైనా నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని చెప్పారు. చంద్రబాబు కేవలం ఏపీకి చెందిన వ్యక్తి మాత్రమే కాదని.. దేశ రాజకీయాలకు చెందిన వ్యక్తి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటీ ఉద్యోగుల నిరసనలకు ఒప్పుకోను అనడానికి హైదరాబాద్ కేటీఆర్ జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణ అంశంపై నిరసన తెలపవచ్చు కానీ ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఇక్కడి ఐటీ వాళ్లు నిరసన తెలియచేస్తే అడ్డుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు జాతీయస్థాయి నేత అన్నారు. చంద్రబాబు అంత అనుభవం ఉన్నవాళ్లు వేళ్లపై లెక్కబెట్టవచ్చునన్నారు. హైదరాబాద్ పదేళ్ల పాటు తెలుగురాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, అలాంటప్పుడు ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన తెలియజేయవద్దంటే ఎలా? అన్నారు. ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో కూడా నిరసనలు జరిగాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version