టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. అత్త, తల్లి పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించడం తో పాటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రగతి సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో పాటు వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా కుర్రాళ్ళు ప్రగతి అంటే పడి చచ్చిపోతారు. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రగతి సినిమా సెట్స్ లోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది. అయితే.. తాజాగా ప్రగతి ఆంటీ.. జిమ్ లో రచ్చ చేసింది. ప్రతి రోజూ నటి ప్రగతి.. జిమ్ కు వెళుతుందన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే… ఓ వ్యక్తిని తన కాళ్లపై నిలుచోబెట్టుకుని.. మరీ.. విన్యాసాలు చేసింది నటి ప్రగతి. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రగతి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫిదా అయిపోతున్నారు. ఏం ఎనర్జీ ఆంటీ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు నెటిజన్లు.