స్నేహితురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు, ప్రకాశం జిల్లా సి ఎస్ పురం మండలం అంబవరానికి చెందిన శ్రీనివాసులు (40) వెటర్నరీ ఆసుపత్రిలో అటెండర్ గా పనిచేస్తున్నారు. అదే మండలానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా శెట్టిగుంట రోడ్డులోని వైటీనాయుడు వీధి సమీపంలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు.
ఆమెతో శ్రీనివాసులు సన్నిహితంగా ఉంటూ ఇటీవల ఇంటికొచ్చారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై సదరు మహిళను పోలీసులు విచారించగా, తాను పనిపై బయటికెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిజిహెచ్ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. సదరు మహిళను పోలీసులు విచారిస్తున్నారు.