అదే మా కొంపముంచింది.. భారత్ గెలవడం అంత ఈజీ కాదు – పింఛ్‌

-

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.5 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టి20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది.

ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. మ్యాచ్ ప్రెసెంటేషన్ టైం లో ఫించ్ మాట్లాడుతూ, నిజంగా ఇది చాలా మంచి సిరీస్. మేము మ్యాచ్ లో ఒకానొక టైం లో వెనకబడ్డ తిరిగి కం బ్యాక్ అయ్యి పోరాడిన విధానం అద్భుతం. ఈ మ్యాచ్ లో కెమెరున్ గ్రీన్ లాంటి యువ ఆటగాడు ఎలాంటి ప్రభావం చూపగలడు మేం చూసామని తెలిపారు.

అయితే మా ఓటమికి కారణం చెప్పాలంటే మేము మరో రెండు మూడు వికెట్లు తీయాల్సింది. భారత్ లాంటి జట్టు పై బాల్స్ డాట్ చేయిస్తూ గెలవలేము. తప్పకుండా వికెట్లు తీస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. వికెట్లు తీయకపోవడమే మా కొంపముంచింది. ఎందుకంటే భారత్ వరల్డ్ క్లాస్ టీం. ఒకరిద్దరూ బ్యాటర్లు చివరి వరకు ఉన్నా, ఆ జట్టు గెలవడం పక్కా అన్నారు. ఇక మేము బ్యాటింగ్ టైం లో కొంత అలసత్వం ప్రదర్శించాం. ఫీల్డింగ్ పరంగాను కాస్త అలసత్వం చూపించాం. ఏదేమైనా భారత్ లాంటి ప్రపంచస్థాయి జట్టుతో ఇలాంటి గట్టి సిరీస్ ఆడటం మా ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్ ను ఇస్తుంది. ముఖ్యంగా గ్రీన్ తన అల్ట్రా-దూకుడు విధానంతో గేమ్ గేమ్ ను తీసుకున్న విధానం నాకు చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version