‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ ఫస్ట్ లుక్ రిలీజ్

-

మహేశ్ భట్ తనయగా బాలీవుడ్ కి పరిచయమైనా.. ఎక్కడా తన తండ్రి నీడ పడకుండా తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది ఆలియా భట్. తొలి సినిమా నుంచి తనకు మెప్పిన కథలను ఎంచుకుంటూ సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తూ అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడు బాలీవుడ్ లోనే నంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగిన ఆలియా భట్.. త్వరలోనే హాలీవుడ్ చిత్రంలోనూ మెరవనుంది.

‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ సినిమాతో ఆలియా భట్ హాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తోంది. అందులో కేయ అనే పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని నిర్మాణ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఆదివారం విడుదల చేసింది. ‘ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చరిత్ర సృష్టించనుంది. అలియా కేయ ధావన్‌గా కనిపిస్తుండగా, గాల్‌ గ్యాడోట్‌ రాచెల్‌ స్టోన్‌గా అలరించనుంది. వాస్తవిక కథాంశాలకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులు సొంత కథగా భావిస్తారు. తప్పకుండా భావోద్వేగానికి గురవుతారు’ అని ఈ సందర్భంగా పేర్కొన్నాయి సినీవర్గాలు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఆలియా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కడుపులో బిడ్డతోనే ఆలియా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version