వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా గెలిచే అరహతాలు అన్నీ ఉన్న జట్టుగా ఇండియాలోకి అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. కెప్టెన్ పాటు కమిన్స్ సారథ్యంలో ఆడుతున్న ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్ లలో దారుణంగా ఆడి ఓటమి పాలయ్యింది. ఈ రోజు శ్రీలంకతో గెలిస్తేనే సెమీస్ కు వెళ్ళడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో బౌలింగ్ లో అదరగొట్టి శ్రీలంక ను 209 పరుగులకు ఆల్ అవుట్ చేసి, ఇప్పుడు బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. ఆరంభంలో వార్నర్ స్మిత్ లు అవుట్ అయినా ఎక్కడ బెదరని ఆసీస్ విజయం దిశగా దూసుకువెళ్లింది. ముఖ్యంగా ఓపెనర్ మిచెల్ మార్ష్ (52) తనదైన దూకుడు ఆటతో అర్ద సెంచరీ చేశాడు. ఆ తర్వాత లాబుచెన్ (40) మరియు ఇంగ్లీష్ (58) లు జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను భుజాలమీద వేసుకున్నారు.
కానీ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ అయినా మాక్స్ వెల్ (31) మరియు స్టాయినిస్ (20) లు మిగతా పనిని వేగంగా పూర్తిచేశారు. మరో ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని అందించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచారు. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన శ్రీలంక దాదాపుగా సెమీస్ కు దూరం అయినట్లే.