కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్ రాకపోవడానికి కేసీఆర్ కారణం : రేవంత్‌ రెడ్డి

-

డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుంది.. అదే రోజు ఉదయం 10.30 గంటలకు ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ తొలి సంతకం చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతో కష్టపడి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేయిస్తే, ఆ నీళ్లను జగన్ రెడ్డి తీసుసుకుపోయారని రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… పాలమూరు – రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. వికారాబాద్‌కు కృష్ణా జలాలు రాకపోవడానికి కారణం ఎవరన్నారు. ఎంఎంటీఎస్ రైలు వికారాబాద్ వరకు తీసుకు రావడానికి జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు రేవంత్ రెడ్డి.

అయినప్పటికి ఇప్పటికీ వికారాబాద్‌కు కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్ రైలు రాకపోవడానికి కారణం కేసీఆర్ అని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలకు తెలియకుండానే ఇక్కడ రౌడీయిజాన్ని కేసీఆర్ తీసుకు వచ్చారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు మంజూరు చేయిస్తే నీళ్లను జగన్ రెడ్డి తీసుకు వెళ్లగా, నిధులను కృష్ణారెడ్డి తీసుకు పోయారన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలు హరిస్తోందన్నారు. ఉద్యోగ పరీక్ష జరగలేదనే బెంగతో ఇటీవలే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. తెలంగాణ దశ, దిశ మారాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version