ఆస్ట్రేలియాలో లో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్ లో ప్రపంచంలో ఇప్పటి వరకు జరగని… ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మనం ఒక ఓవర్లో ఆరు సార్లు కొట్టడం చూశాం… ఆరు సిక్సర్లు కొట్టడం కూడా మన క్రికెట్ ఆటగాళ్లకు పెద్ద సవాల్. అంతే కాదు ఆరు సార్లు కొడితే ఓ రికార్డ్ క్రియేట్ చేయడం మాత్రం ఖాయం. అయితే తాజాగా పెర్త్ లో జరిగిన క్లబ్ క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా దేశవాళి క్రికెటర్… ఒకే ఓవర్లో ఏకంగా 8 సిక్సర్లు బాదేశాడు.
ఈనెల 19వ తేదీన సో డన్ క్రయింగ్ సీనియర్ క్లబ్ మరియు కింగ్స్ స్లై వుడ్ వెల్ సీనియర్ క్లబ్ జట్ల మధ్య 40 ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్ రికార్డుల్లోకి ఎక్కడం గమనార్హం. ఈ మ్యాచ్ లో సోరెంటో క్లబ్ క్రికెట్ ఆటగాడు సామ్ హారిసన్ ఒకే ఓవర్ లో ఏకంగా ఎనిమిది సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు.
కింగ్ స్లే జట్టుకు చెందిన బౌలర్ నాథన్ బెన్నెట్ వేసిన… ఓవర్లో రెండు నో బాల్స్ కూడా పడ్డాయి. దీంతో అతడు మొత్తం 8 బాల్స్ వేయాల్సి వచ్చింది. ఈ ఎనిమిది బంతులకు ఎనిమిది సిక్సర్లు అంటే 48 పరుగులు సాధించాడు హరిసన్. ఇక ఈ మ్యాచ్ లో హారిసన్ ఏకంగా 11 సిక్సర్లు, ఆరు ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఇక 8 సిక్సర్లు కొట్టడం పై పలువురు క్రికెటర్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.