పాతబస్తీలో రెచ్చిపోతున్న పోకిరీలు.. ఆటోలతో రేసింగ్. అరెస్ట్ చేసిన పోలీసులు

-

పాతబస్తీలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. బైక్ రేసింగ్ లాగా ఆటో రేసింగ్ లతో హంగామా చేస్తున్నారు. రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలకు ప్రమాదాలను తీసుకువస్తున్నారు. వారి సంతోషం కోసం ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. మూడు టైర్లతో నడవాల్సిన ఆటోలను ప్రమాదకరంగా రెండు టైర్లపైనే నడిపిస్తూ.. నడిరోడ్డుపై హంగామా చేశారు. ఇతర వాహనాలకు కట్ కొడుతూ.. రేసింగ్ చేశారు. ఓవైసీ ఫ్లైఓవర్ నుంచి చంద్రాయణ గుట్ట వరకు ఇలా ప్రమాదకరంగా ఆటోలను నడిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్ లో వైరల్ కావడంతో.. పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. కేవలం 12 గంటల్లోనే నిందితులు ఆరుగురిని పట్టుకోవడంతో పాటు.. మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

చంద్రాయణ గుట్ట ఇన్స్పెక్టర్ కే ఎన్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం…. శుక్రవారం అర్థరాత్రి 12.30 గంటలకు డీఆర్డీఎల్ నుంచి చంద్రాయణ గుట్ట వైపు ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ.. వెళ్తున్న మూడు ఆటోలను పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు గుర్తించారని.. ఉదయం 8.30 గంటలకు విధుల్లో ఉన్న పీసీ ప్రసాద్ రావు ఫిర్యాదు చేశారని… దీంతో పెక్టార్ 1 లో ఉన్న సీసీ కెమెరాల సహాయంతో.. ఆటోను గుర్తించి నిందితుడిని ఎక్వైరీ చేశామని అన్నారు. దీంతో ఈ రేసింగ్ లో పాల్గొన్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనలో టోలీచౌకీ చెందిన సయ్యద్ జుబేర్ అలీ( 20), సయ్యద్ సాహిల్( 21), మహ్మద్ ఇబ్రహీం( 22), మహ్మద్ ఇన్నాయత్( 23), గులామ్ సైఫుద్దీన్(23), మహ్మద్ సమీర్( 19), అమీర్ ఖాన్ (20) లలో ఆరుగురిని అపులోకి తీసుకున్నామని.. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మూడు ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నామని.. వీటిపై భారీగా పెండింగ్ చలానాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. 12 గంటల్లో కేసును ఛేదించిన చంద్రాయణ గుట్ట పోలీసులను ఫలక్ నుమా ఏసీపీ మాజిద్ అభినందించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version