రేపు ఆటోలు, క్యాబ్‌లు బంద్కానున్నాయి కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేస్తోంది.అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని ఆటోడ్రైవర్‌లు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్‌కు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో రేపు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో తమ పొట్ట కొడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఉచిత ప్రయాణం ఆఫర్ తో మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడంతో తమకు గిరాకీ లేక పొట్టకూటికి కూడా డబ్బు సంపాదించలేక పోతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రోజున ఆటో బంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు.