గత రెండు రోజులుగా ఏపీలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఈ విషయంపై ట్విట్టర్ లో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన అనంతరం మొదలైన ఈ డిస్కషన్స్.. అవంతి శ్రీనివాస్ మాటతో కన్ ఫాం అనే ఫీలింగ్స్ ని తీసుకొచ్చాయి. అయితే.. ఇంతకాలం సాయిరెడ్డి చెప్పినట్లుగా కేవలం బాలికల సైకిళ్ల స్కామే కాకుండా… మరో స్కాం కూడా ఉందని చెబుతున్నారు అవంతి శ్రీనివాస్!
ఈఎస్ ఐ స్కాం అనంతరం ఏపీ సర్కార్ ఏ విషయంపై దృష్టి సారించిందా అనే ఆలోచించే సమయంలో… అమరావతి కేంద్రంగా అవినీతి జరిగిందంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడనే పేరున్న తుళ్లూరు మాజీ తహసిల్ధార్ సుధీర్ బాబుని అరెస్టు చేసింది సీఐడి! అనంతరం భీమిలి కేంద్రంగా మరో భూకుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు అవంతి శ్రీనివాస్. ఇందులో భాగంగా పూర్తి వివరాలు కూడా సేకరించారంట.
ఇప్పటికే “నెక్స్ట్.. గంటా” అనే హాట్ టాపిక్ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న నేపథ్యంలో… భీమిలిలో భారీ భూకుంభకోణం జరిగిందని.. ఆ కంభకోణానికి సంబందించిన అన్ని ఆధారాలను సీఎం వైఎస్ జగన్ కి ఇచ్చామని చెబుతున్నారు అవంతి. దీనిపై స్పందించిన సీఎం జగన్… ఈ వ్యవహారంపై “సిట్” విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. దీంతో.. “నెక్స్ట్.. గంటా” ఫిక్సయిపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి! కాగా, 2014ఎన్నికల్లో గంటా శ్రీనివాస రావు, భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కొనసాగారు!