న్యూజిలాండ్ తో వన్డే టి20 సిరీస్ లకు టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ ఇద్దరిని ఎంపిక చేయలేదని చేతన్ శర్మ నేతృత్వంలోని ఆల్ ఇండియా సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది.
అయితే పెళ్లి కోసమే కేఎల్ రాహుల్ ఈ రెండు సిరీస్ లకు దూరంగా ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. తన ప్రియురాలు బాలీవుడ్ హీరోయిన్ అథియ శెట్టితో రాహుల్ పెళ్లి ఈనెల 23న జరగనుంది. అయితే స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా పెళ్లి కోసం ఈ రెండు సిరీస్ లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రియురాలైన మేహ పటేల్ ను అక్షర్ పటేల్ ఈ నెలలోనే వివాహం చేసుకోనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. అక్షర్ చాలా కాలంగా నేహా పటేల్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.