అయోధ్య నగరం.. శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైంది. దింతో పెద్ద సంఖ్యలో బాలరాముడి దర్శనానికి తరలి వస్తున్నారు భక్తులు.. మధ్యాహ్నం 12గంటలకు బాలరాముడికి సూర్య తిలకం ఇవ్వనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భద్రత కట్టుదిట్టం చేశారు.. భారీ ఎత్తున బలగాలను మోహరించారు పోలీసులు.

కాగా శ్రీరామనవమి రోజున రాముడిని పూజించడం, రామచరిత మానస్‌ను పఠించడం వల్ల మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. వివాహంలో పదే పదే అడ్డంకులు ఏర్పడుతుంటే ఈరోజు సీతారాములకు పసుపు, గంధం, కుంకుమను సమర్పించండి. ఇలా చేస్తే కోరుకున్న జీవిత భాగస్వామిని పొందవచ్చు. వ్యాధుల నుంచి బయటపడటానికి రామ నవమి రోజున హనుమంతుడిని పూజించండి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.