గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న వాహనదారులకు బిగ్ అలర్ట్. గ్రేటర్ హైదరాబాదులో వాహనాలు నడిపే వారికి పోలీసులు షాక్ ఇచ్చారు. మైనర్లు బండి నడిపితే రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. మైనర్లు బండి నడిపితే 12 నెలలు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

మైనర్ కు 25 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చేస్తామని తెలిపారు. ఇక ఇవాల్టి నుంచి ప్రత్యేకంగా దీనిపైన డ్రైవ్ నిర్వహించబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు. మైనర్ బైక్ నడిపితే.. పట్టుబడితే తల్లిదండ్రులు అలాగే బైక్ యజమానిపై కూడా చర్యలు తీసుకోనున్నారని చెల్లిస్తోంది. దీంతో వాహనదారులు గజ గజ వణికిపోతున్నారు.
- గ్రేటర్ వాహనదారులకు పోలీసుల షాక్
- మైనర్లు బండి నడిపితే రిజిస్ట్రేషన్ రద్దు
- మైనర్ బండి నడిపితే 12 నెలలు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
- మైనర్ కు 25 ఏళ్ల పాటు నో లైసెన్స్
- నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్.
- మైనర్ బైక్ నడిపితే పట్టుబడితే తల్లిదండ్రులకు, బైక్ యజమానిపై చర్యలు..