అయోధ్య రామమందిర ప్రారంభ తేదీ వచ్చేసింది…!

-

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం హిందుత్వ సంస్థలు సిద్దమవుతున్నాయి. సుప్రీం కోర్ట్ లో తమకు అనుకూల తీర్పు రావడం, వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణం చేపట్టాలని సుప్రీం కోర్ట్ చెప్పిన నేపద్యంలో అటు ప్రభుత్వం ఇటు హిందుత్వ సంస్థలు రామ మందిర నిర్మాణం కోసం సిద్దమవుతున్నారు.

ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రామ మందిర నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభానికి సంబంధించిన తేదీలు విడుదల చేసారు. మార్చి నెల 25 నుంచి ఏప్రిల్ రెండో తేదీలోగా ఈ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి. మందిర నిర్మాణ కమిటీలో

11 మందిలో విశ్వహిందూ పరిషత్ నేతలతో పాటు పలు సంస్థల ప్రతినిధులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తున్నారు. దేశ ప్రజల సహకారంతో వారి భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలు హిందుత్వ సంస్థలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. అటు సిని ప్రముఖులు కూడా విరాళాలు అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version