విశాఖ స్టీల్ ఫ్లాంట్ ను అమ్మకానికి పెట్టడం చాలా బాధాకరం అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. స్టీల్ ఫ్లాంట్ చరిత్రను కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలన్న ఆయన రైతులు త్యాగం చేసి, విలువైన భూములు స్టీల్ ఫ్లాంట్ కు ఇచ్చారని అన్నారు. 64 గ్రామాల ప్రజలు నివసించే ప్రాంతాలను ఫ్యాక్టరికి త్యాగం చేశారని, విశాఖలో 25 శాతం మంది స్టీల్ ఫ్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. అన్ని పార్టీలు ఒకే మాట మీదకి వచ్చి ఫ్లాంట్ కు కాపాడుకోవాలని అయన అన్నారు.
ఇటువంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు?18 నెలలో కాలంలో జగన్ మోహన్ రెడ్డి 20 సార్లు ఢిల్లి వెళ్ళి ఏమి పీకారు? అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే ఏమీ చెప్పాలో అర్థం కావడం లేదన్న ఆయన రైల్వే జోన్ పట్టాలపై ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. స్టీల్ ఫ్లాంట్ కాపాడుకోవడానికి ప్రజలందరు ముందుకు రావాలన్న ఆయన రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి వ్యాపార సంస్థగా మార్చేశారని అన్నారు.