‘బాహుబలి’ రీరిలీజ్.. ఈసారి రెండు భాగాలు కలిపి ఒకేసారి రాబోతున్నాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది రాజమౌళి చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చి సంచలనం సృష్టించింది బాహుబలి సిరీస్.

బాహుబలి విడుదలై పదేళ్లు కావస్తున్న నేపథ్యంలో ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న మరోసారి రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు డైరెక్టర్ రాజమౌళి. దింతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.