మాస్టారుగా మారిన సీఎం చంద్రబాబు…. విద్యార్థిగా లోకేష్

-

సీఎం చంద్రబాబు మాస్టారుగా మారగా…. విద్యార్థిగా లోకేష్ కనిపించారు. మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ విద్యార్థులు బాగా చదువుకొని రాజకీయాల్లోకి రావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. శ్రీ సత్య సాయి జిల్లా కొత్త చెరువులో సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులతో ముచ్చటించారు. అందులో భాగంగానే విద్యార్థులు బాగా చదువుకొని గొప్పవాళ్లు కావాలని రాజకీయాల్లోకి రావాలని చెప్పారు.

నాయకులు అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు అని అడగగా అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు స్పందించలేదు. చదువుకున్న వారందరూ ఉద్యోగాలు చేసుకుంటే ఎలా రాజకీయాలు జీవితాలను పూర్తిగా మారుస్తాయి. లోకేష్ చదువుకొని మంత్రి అయ్యారు విద్యారంగంలో మార్పులకు అనేక రకాల చర్యలు చేపడుతున్నాడని సీఎం చంద్రబాబు నాయుడు అయ్యారు. బాగా చదువుకుని రాజకీయాల్లోకి కూడా రావాలి ఉద్యోగాలు చేస్తే సరిపోదు. రాజకీయాలు కూడా చాలా అవసరం అని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news