ఏనుగు తో రాందేవ్ బాబా గేమ్స్..నెటిజన్ల సెటైర్లు…!

పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు, యోగా గురు బాబా రామ్‌దేవ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉన్నారు. ఓ ఆశ్రమంలో ఏనుగు మీద యోగా నేర్పిస్తూ కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై రకారకాల మీమ్స్ తో, యాక్ట్ ఆఫ్ గ్రావిటీ అంటూ జోకులేస్తున్నారు నెటిజన్లు.తనతో గేమ్స్ ఆడితే ఏమవుతుందో బాబా రాందేవ్‌కు అర్థమయ్యేలా చేసిందా గజరాజు. ఆసనమేద్దామని బాబా ప్రయత్నించారు. ఒక్కసారిగా ఏనుగు కదలడంతో కిందపడ్డారు..

ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఓ ఆశ్రమం నిర్వహించిన శిబిరంలో …. యోగా నేర్పించే ప్రయత్నం చేశారు బాబా రాందేవ్.. అయితే అక్కడ చక్కగా అలంకరించి ఉన్న ఏనుగును చూసి ఉత్సాహం పట్టలేక వెరైటీగా ఆసనాలు వేద్దామనుకున్నారు. ఏనుగుపై పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో వివరిస్తున్నారు.ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఏనుగు కుదురుగా ఉండకుండా అటూ ఇటూ కదిలింది. అయినా బాబా బింకంగా అవేమీ పట్టించుకోకుండా యోగా భంగిమను కొనసాగించారు. మరోసారి ఏనుగు కదలడంతో అదుపు తప్పి రాందేవ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే సర్దుకున్నరాందేవ్, అక్కడినుంచి లేచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ గతంలో సైకిల్ తొక్కుతూ రాందేవ్ కింద పడ్డ వీడియో కూడా ఇపుడు విపరీతంగా షేర్ అవుతోంది.