ఇండియా మరియు పాక్ సమరానికి సమయం దగ్గర పడుతోంది. ప్రపంచ కప్ వేదికల్లో తిరుగులేని భారత్…మరోసారి పాకిస్తాన్‌తో తలపడేందుకు రెడీ అయింది. ధనాధన్ మ్యాచ్‌ల్లో ఎదురులేని భారత్…మరోసారి ప్రత్యర్థిని ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే బాబర్ జట్టును ఓడించి…శుభారంభం చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన.
అయితే… ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలు, రాజ ధర్మానికి విరుద్ధమని అన్నారు. పాక్ సరిహద్దు లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు.. క్రికెట్ మ్యాచ్ ఆడటం రాజ ధర్మానికి పూర్తి గా వ్యతిరేకమని చెప్పారు.
దేశ ప్రయోజనాలకు సరికాదన్నారు బాబా రాందేవ్. క్రికెట్ మరియు టెర్రర్ రెండు గేమ్ లను ఒకే సారి ఆడలేమని వ్యాఖ్యానించారు బాబా రాందేవ్. కాగా.. ఇండియా, పాక్ సమరం ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో దేశంలోని క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్ పై ఉత్కంఠంగా చూస్తున్నారు.