Baby food sugar controversy explained by Nestle: నెస్లే ఇండియా కీలక ప్రకటన చేసింది. పిల్లలకు ఇచ్చే ఆహార ఉత్పత్తుల్లో మూడు గ్రాములు అదనంగా చక్కర వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై నెస్లే ఇండియా స్పందించింది.
భారత్ లో తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కర శాతాన్ని గత ఐదేళ్లలో 30% తగ్గించినట్టు పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, వెనుకబడిన ఆఫ్రికా దేశాలు నెస్లే నుంచి వచ్చే బేబీ ప్రొడక్టుల్లో చక్కెర పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి.