ఫోన్ మాట్లాడుతూ పిల్లాడిని వదిలేసింది… చివరికి… వైరల్ అవుతున్న వీడియో…!

-

నిన్నా మొన్నా పుట్టిన పిల్లల నుంచి… పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేకపోతున్నారు. ప్రతీ నిమిషం ఫోన్ లో ఉంటూ పక్కన వారిని కనీసం పట్టించుకోవడం లేదు. ఫోన్ మాట్లాడుతుంటే చాలు ఇక పక్కన ఏం జరిగినా సరే పట్టనట్టు ఉంటున్నారు. ప్రాణం మీదకు వస్తున్నా సరే ఫోన్ వదిలి పెట్టడం లేదు. దీనితో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఫోన్ వదిలిపెట్టకుండా ప్రతి నిమిషం దాంట్లోనే గడుపుతూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు.

ఇక పిల్లలు ఉన్న తల్లులు కూడా పిల్లలను పక్కన పెట్టి మరీ ఫోన్ లో సమయం గడపడంతో పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో పిల్లలతో ఆడుకునే అమ్మలు ఇప్పుడు ఫోన్ లో ఆడుకుంటూ వారికి తల్లి ప్రేమను దూరం చేయడంతో పాటు పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫోన్ లో మాట్లాడుతూ పిల్లాడిని వదిలేయడంతో ఆ బాబు ప్రాణం మీదకు వచ్చింది. త్రుటిలో బాబు ప్రాణాల నుంచి బయటపడ్డాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే…

కొడుకుతో కలిసి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తల్లి.. ఫోన్‌లో మాట్లాడుతూ అక్కడే నిలబడ్డారు. ఇక పిల్లాడు తల్లి చేయి వదిలేసి పక్కనే ఉన్న మెట్ల దగ్గరకు వెళ్లి వాటికి ఉన్న రెయిలింగ్ పట్టుకుని వేలాడుతూ… ముందుకు చూస్తూ వంగాడు. ఒక్కసారిగా కిందకు పడబోతుండగా ఇంతలో వెనక్కు తిరిగిన తల్లి గమనించి వెంటనే ఆ పిల్లాడి కాలు పట్టుకుని పైకి లాగింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంది వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ ఉన్న సీక్రెట్ కెమెరాలు ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version