ముగిసిన బీఏసీ.. సీఎం కేసీఆర్, భట్టి మధ్య ఆసక్తికర సంభాషణ !

-

బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగేలా నిర్ణయించారు. వాడి వేడిగా బీఏసి జరిగింది. మీడియా పాయింట్ పై భట్టి.. సీఎం కేసీఆర్ మధ్య చర్చ జరిగింది. మీడియా పాయింట్ ఎలా ఎత్తేస్తారు ? మా పాత్ర ను కూడా మీరే కట్టడి చేస్తే ఎలా  ? మీరు ఇక్కడ మైక్ ఇవ్వరు ! కనీసం మీడియా పాయింట్ అయినా ఉంచాలి కదా కదా అని భట్టి సీఎంను ప్రశ్నించారు. అయితే సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా అని సీఎం కేసీఆర్ ప్రస్నించినట్టు సమాచారం. అబద్దాలు మాట్లాడొద్దు…సభలో మైక్ ఎందుకు ఇవ్వలేదు ? అని ఆయన పేర్కొన్నారు.

cm kcr to meet colonel santosh babu home

కోవిడ్ కారణంగా… మీడియా పాయింట్ ఎత్తేశామని సభ్యుల సంఖ్యను బట్టి సభలో సమయం ఇస్తారని సీఎం పేర్కొన్నారు. మేము నామినేటెడ్ ప్రభుత్వం కాదని, ఇక్కడ చాలా మంది చాలా మాట్లాడుతున్నారని అన్నారు. మేము కూడా అన్ని విషయాలు చెప్తామని సీఎం అన్నారు. మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పండి, మేము చెప్పాలనుకున్నది మేము చెప్తామని భట్టి పేర్కొన్నారు. ఇక రేపు పీవీ శత జయంతి ఉత్సవాలపై చర్చ జరగనుండగా, 12, 13, 20, 27న సెలవులు ఉండనున్నాయి. అలా మొత్తం మీద 17 పని దినాలు సభ సాగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version