బ్రేకింగ్ : తెలంగాణాలో మరో ఎన్ కౌంటర్.. ఎస్పీ వెళ్ళిన కాసేపటికే !

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొద్ది సేపటి క్రితమే ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్ ఘడ్ – తెలంగాణా సరిహద్దు అడవుల్లోలోని తెలంగాణ ప్రాంతంలో కొద్దిసేపటి క్రితమే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు. నిన్న రాత్రి చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు సమీపంలోని తిప్పాపురం ప్రధాన రహదారిపై మావోయిస్టులు మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో ఎవరు గాయపడనప్పటికీ ఇది పోలీసు యంత్రాంగానికి సవాల్ చేసినట్టు ఉండడంతో వారు కూంబింగ్ మొదలు పెట్టారు.

వాస్తవానికి నాలుగు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని గుండాల మండలంలో శంకర్ అనే వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా మావోయిస్టులు తూర్పుగోదావరి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిన్న ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. అయినా తమ ఉనికి చాటుకోవడానికి నిన్న రాత్రి మావోయిస్టులు చర్ల మండలంలో మందుపాతర పేల్చారు. ఈ మందు పాత్రతో ప్రధాన రహదారి మీద పెద్ద గొయ్యి ఏర్పపడింది. ఈ నేపథ్యంలో ఘటనాస్థలిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ సందర్శించారు. ఆయన వచ్చి వెళ్ళగానే మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version