ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. ఆ ముగ్గురుకు ముందు తెలియదా?

-

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు… ఎన్నేళ్లు గడిచిన టీడీపీ అధినేత చంద్రబాబుని వదలని ఒక మచ్చ. ఆయన ప్రత్యర్ధులంతా వెన్నుపోటు వెన్నుపోటు అంటూ ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు. రాజకీయంగా చంద్రబాబుని ఎదుర్కోవడానికి ప్రత్యర్ధులకు అదొక అస్త్రమనే చెప్పాలి. అప్పటిలో కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైసీపీకి ఇదే అస్త్రం.

అవును ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అనేది బాబుని జీవితాంతం వెంటాడే మచ్చ. అయితే దీని వెనుక కారణాలు మాత్రం పూర్తిగా ఎవరికీ తెలియదనే చెప్పొచ్చు. అప్పటిలో ఉన్న వారికి తెలుసుగానీ, ఇప్పుడు ఉన్నవారికి అంతగా తెలియదు. ప్రత్యర్ధులు వెన్నుపోటు అంటే… అమ్మో చంద్రబాబు… ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారా అని ప్రస్తుతం ఉన్న జనరేషన్ భావించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు గానీ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంటారు.

అప్పటిలో టీడీపీని ఒక దుష్ట శక్తి ఎన్టీఆర్‌ని గ్రిప్‌లో పెట్టుకుని, పార్టీని చేతులోకి తీసుకుని నాశనం చేస్తుంటే… చంద్రబాబు, టీడీపీ నేతలు తిరగబడి పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ని గద్దె దించి చంద్రబాబు సీఎం అయ్యారని చెబుతారు. ఇక టీడీపీని చేతులో పెట్టుకోవాలని చూసిన దుష్టశక్తి ఎవరో కూడా అందరికీ తెలుసని టీడీపీ నేతలు చెబుతారు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ మానసికంగా క్రుంగిపోవడం, గుండెపోటుతో మరణించడం జరిగాయి. దీంతో చంద్రబాబుపై ప్రత్యర్ధులు దాన్ని అడ్డం పెట్టుకుని దాడి ఎక్కువగా చేశారు. ఇదంతా 1996లో జరిగింది.

సరే చంద్రబాబు టీడీపీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.. ఒకవేళ ఆయన ఎన్టీఆర్‌కే అన్యాయం చేశారు… పార్టీని దుర్మార్గంగా లాక్కున్నారంటే… ఆ వెంటనే జరిగిన 1999 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాలి… చంద్రబాబు మళ్ళీ సీఎం కాకూడదు. కానీ టీడీపీ గెలిచింది… చంద్రబాబు సీఎం అయ్యారు. ఇక ఆ తర్వాతైన చంద్రబాబు రాజకీయంగా ఎదగకూడదు… కానీ ఇప్పటికీ టీడీపీ స్ట్రాంగ్‌గా ఉందంటే దానికి కారణం చంద్రబాబు.

మరి ఇంత జరిగినా కొందరు నేతలు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని మాట్లాడుతున్నారు. విడ్డూరం ఏంటంటే.. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత… చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వచ్చి.. ఆ పార్టీ తరుపున గెలిచిన నేతలు… మళ్ళీ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు బాబు… ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని, పార్టీని లాక్కున్నారని మాట్లాడటం కరెక్ట్‌గా లేదనే చెప్పాలి. రోజా కూడా చంద్రబాబుతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు… ఆమె కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ ముగ్గురుకు టీడీపీలో చేరేప్పుడు చంద్రబాబు… ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని తెలియదా? వేరే పార్టీలోకి వచ్చాకే తెలిసిందా? అంటే ఇదంతా రాజకీయమని అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version