క్రికెట్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్…

-

ప్రపంచ క్రికెట్ కి ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ లు ఇప్పట్లో జరిగే అవకాశాలు దాదాపుగా లేవు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో జనాలు ఎక్కువగా గుము గూడే ప్రదేశాలకు అనుమతులు ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చే జరుగుతుంది.

ఒకవేళ ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ని ఎత్తేస్తే క్రికెట్ ని అనుమతించే అవకాశం ఉందా లేదా అనే దాని మీద అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో ఐపిఎల్ ని కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అక్టోబర్ లో ఆస్ట్రేలియా లో జరిగే టి20 ప్రపంచకప్ ని కూడా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే సూచనలు ఏ విధంగా కూడా కనపడటం లేదు.

దీనితో టి20 ప్రపంచ కప్ కోసం తమ దేశ ఆటగాళ్లను పంపడానికి ఏ దేశ౦ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇప్పుడు క్రికెట్ కంటే తమ ఆటగాళ్ళ భద్రత దేశాలకు చాలా కీలకం. ఇక అభిమానులు కూడా ప్రపంచకప్ చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి వస్తు ఉంటారు. దీనితో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు నెలలు పరిస్థితి ఇదే విధంగా ఉంటే,

టి20 ప్రపంచ కప్ ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రెండు నెలల్లో ఐసిసి పరిస్థితిని అంచనా వేయడానికి గానూ ఒక కమిటిని నియమించింది అని ఆ కమిటి ఇప్పుడు పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత నిర్వహించాలా వద్దా అనే దాని మీద నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. ఈ టోర్నీ జరగకపోతే మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా భారీగా ఆర్ధిక నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version