బడే భాయ్ అని వెంటపడితే కుదరదు.. రేవంత్ పై మోదీ సెటైర్లు

-

అవినీతిలో పతకాలు ఇస్తే కాంగ్రెస్కు గోల్డ్ మెడల్, బీఆర్ఎస్కు సిల్వర్ మెడల్ వస్తుందని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ నన్ను బడే భాయ్ అని పిలవడం సంతోషకరం. కానీ పెద్దల నుంచి చిన్నవాళ్లు మంచి విషయాలు నేర్చుకోవాలి కదా? ముఖ్యమంత్రి గా, ప్రధానిగా అందరికంటే ఎక్కువ కాలం ఒక్క మచ్చా లేకుండా పనిచేశా. దీన్ని తమ్ముడు నేర్చుకోవాలి అని సూచించారు. అన్నిచోట్లా పెద్దన్నా పెద్దన్నా అని వెంటపడితే కుదరదు’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కేంద్రంలో సంకీర్ణం వస్తుందని కేసిఆర్ చేస్తోన్న వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ‘ఆయన ఎప్పుడూ ఇలాంటి అబద్ధాలే చెబుతారు. జిహెచ్ఎంసి ఎన్నికలయ్యాక కేసిఆర్ నా దగ్గరికి వచ్చారు. ఎన్డీఏలో చేరతా అన్నారు. కానీ మేం విపక్షంలోనే ఉండి పోరాడతాం అని చెప్పా అని తెలిపారు.ఇప్పుడు కాంగ్రెస్-బీఆర్ఎస్ చెరోవైపు బండి (ప్రభుత్వం) ని లాగుతున్నాయి. త్వరలో దాన్ని బీజేపీ చేతిలో పెట్టి వెళ్లిపోతాయి. చూస్తూ ఉండండి’ అని ప్రధాని మోడీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news