బద్వేల్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట కలశపాడు మండలం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్టు ప్రకటించారు. ఇక ముందు నుండి బద్వేల్ లో వార్ వన్ సైడ్ అని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో జనసేన టిడిపి పోటీ నుండి తప్పుకున్నాయి.
ఇక ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది మొత్తం 28 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 12 రౌండ్లలో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు బద్వేలు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే ఈరోజు హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ కూడా అధికార టీఆర్ఎస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో లీడ్ లో ఉంది. ఇక బద్వేల్ లోని అధికార పార్టీ నే లీడ్ లోకి వచ్చింది.