Samantha: మూడ్ బాగోలేకపోతే.. బెడ్రూమ్‌లో అలా చేస్తా: స‌మంత

-

Samantha: నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న త‌ర్వ‌త స‌మంత నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక ఆస‌క్తిక‌ర పోస్టులు చేస్తూ త‌న అభిమానులను ప‌లుక‌రిస్తుంది. ఆమె షేర్‌ చేస్తున్న పోస్టుల్లో మాత్రం ఏదో తెలియని బాధ, ప్రశ్నించే తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పోస్టుల ద్వారా ఏదో చెప్పాలనుకుంటుంది అర్థ‌మ‌వుతుంది.

ఎప్పుడూ సినిమాల‌తో బిజీ బిజీగా ఉండే.. తాను విడాకుల తర్వాత ఆధ్యాత్మిక యాత్ర‌లు చేస్తు క‌నిపించింది. ఇటీవ‌లే.. ఛార్ ధామ్ యాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చిందరవందరగా పడి ఉన్న తన దుస్తులను సర్దుకునే పనిలో పడ్డారు సమంత. ఈ క్ర‌మంలో ఆర్గనైజ్‌ విత్ ఈజ్‌ అనే ఓ సంస్థతో కలిసి తన ఇంటిని చక్కదిద్దుకున్నారు.

ఈ క్రమంలో ఆర్గనైజర్‌తో కలిసి మాట్లాడుతూ త‌న లైఫ్ సైల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఎప్పుడైనా ట్రెస్ గా ఉన్నా.. మూడ్ స‌రిగా లేకపోయినా.. దాని నుంచి బయట ప‌డాటానికి బెడ్ రూంలోని గ‌డుపుతాన‌ని, కబోర్డ్‌లోని దుస్తులను తీసి మళ్లీ సర్దుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే తన డ్రెస్సింగ్ రూంకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు సమంత. ‘కొన్నిసార్లు సర్దుకోవడం, కలపడం కంటే వాటిని అలా వదిలివేయడమే ముఖ్యం’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చారు.

విడాకుల త‌ర్వాత వ‌రుస ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ.. మళ్లీ కెరీర్‌లో బిజీ కావాలని భావిస్తోన్న సమంత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే.. ప‌లు చిత్రాల‌తో బాలీవుడ్ లో అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

https://www.instagram.com/samantharuthprabhuoffl/?utm_source=ig_embed&ig_rid=55e9b922-e551-485b-8a83-3357cb1b02ce

Read more RELATED
Recommended to you

Exit mobile version