ప్రపంచ వ్యాప్తంగా కరోనా విధ్వంసం కలిగించింది. ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. గత రెండేళ్ల నుంచి తన రూపును మార్చుకుని కొత్తకొత్త వేరియంట్ల రూపంలో ప్రజలకు వ్యాప్తి చెందుతోంది. తాజా అధ్యయనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది కరోనా బారి పడి మరణించారు. గత రెండేళ్ల క్రితం కరోనా మొదలైనప్పటి నుంచి మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని వారాల నుంచి రోజుకు 7 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనాతో నమోదైన మరణాల్లో ఎక్కువ 5 దేశాల్లో ఉన్నాయి. అమెరికా, రష్యా, మెక్సికో, బ్రెజిల్, ఇండియాల్లోనే అధిక మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం అమెరికాలో 7.4 లక్షల మరణాలు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగంగా చేస్తున్న కరోనా మహమ్మారి సోకుతుండటం కలవరపరుస్తోంది. తాజాగా యూకే, రష్యాల్లో ఇటీవల కాలంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఈదేశాల్లో కరోనా థర్డ్ వేవ్ మొదలైందనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే అంశం