బద్వేల్ బైపోల్ : కేంద్ర బలగాలు లేకపోవడం పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోము వీర్రాజు..!

-

బద్వేల్ నియోజకవర్గం లో ఈరోజు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా బద్వేలు నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో బిజెపి ఏజెంట్లు ను ఇబ్బందులు కు గురి చేసిన సంఘటనలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జిల్లా ఎస్పీ అన్భురాజన్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. అంతే కాకుండా గోపవరం మండలం బుట్టాయిపల్లి, జోగిరెడ్డి పల్లి గ్రామాల్లో తిరుగుతూ బీజేపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడిన ఎసై చంద్రశేఖర్ పై సోము వీర్రాజు ఆరోపణలు చేశారు.

ఆ ఎస్సై పై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల అబ్జర్వర్ కు సైతం ఫిర్యాదు చేసారు. తిరువెంగళాపురం పోలింగ్ బూత్ వద్ద కేంద్రబలగాలు లేకపోవడంపై జిల్లా ఎస్పీ అన్బురాజన్ వద్ద సోమువీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పోరుమామిళ్ళలో బయట వ్యక్తులు మొహరింపు విషయాన్ని కూడా వీర్రాజు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version