Balagam : ‘బలగం’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న మూవీ బలగం. తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. నిజజీవితానికి దగ్గరగా ఉన్న ఈ సినిమా తమ జీవితాలకు అద్దం పడుతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

అందుకే రోజురోజుకు ఈ చిత్రానికి వసూళ్ల ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయి మంచి ఆదరణ దక్కించుకున్న బలగం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు సిద్ధమైంది. కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 7 లేదా 8వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 3న రిలీజ్ అయిన ఈ సినిమా 19 రోజుల్లో రూ. 19.97 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించింది.

Read more RELATED
Recommended to you

Latest news