Balakrishna: హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ

-

హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ టైమ్ లో బసవతారకం హాస్పిటల్ ట్రస్ట్ సభ్యులు కూడా బాలకృష్ణతోనే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై హీరో బాలకృష్ణ ముచ్చటించారు.మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కలిశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 12 ఏళ్ల క్రితం రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళిని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నగరంలోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

 

వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. పలు అంశాలపై రేవంత్ రెడ్డితో వారు మాట్లాడారు.ఇటివల సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కూడా కలిసిన సంగతి మనకు తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version